Sunday 30 December 2012

ఆహ్వానము

ఆహ్వానము
సనాతన ధర్మమును నమ్మి,విశ్వసించి, ఆచరించే వాళ్ళు, పునర్జన్మ సిద్ధాంతమును నమ్మేవాళ్ళు, దేవుడు వున్నాడు అని నమ్మే వాళ్ళు, బొట్టు పెట్టుకొనే వాళ్ళు, వేదమును మన పురాణములను గాఢంగా నమ్మేవాళ్ళు, ఆది శంకరులు శ్రీ శంకర భగవత్పాదుల సిద్దాంతమును నమ్మేవారు, అద్వైత సిద్దాంతమును నమ్మి ఆచరించే వారు, పెద్దలను, గురువులను గౌరవించే వారు, మన హైందవ సంస్కృతికి గౌరవము ఇచ్చి, ఆచరించే వాళ్ళు, మన మాతృ భాష తెలుగును గౌరవించే వాళ్ళు, శంకర భగవత్పాదులు స్థాపించిన షణ్మతాచారము మీద నమ్మకము వుంచి, పంచాయతనమును నమ్మి కొలిచే వాళ్ళు, దేవుడి మీద నమ్మకము వున్న వాళ్ళు, మంత్ర, తంత్ర, యంత్ర శాస్త్రముల మీద నమ్మకము వున్న వాళ్ళు, వేద, శ్రుతి, పురాణ వాంగ్మయమును భక్తితో నమ్మి కొలిచే వాళ్ళు, ధర్మాచరణ కలిగిన వాళ్ళు, హైందవ సంస్కృతికి అద్దం పట్టే వాళ్ళు, ఆది దంపతులను, శ్రీ సీతారాములను, శ్రీలక్ష్మీ నారాయణులను, శ్రీ వేంకటేశ్వరులను, ఇలవేల్పులుగా, ఇష్ట దైవముగా కొలిచే వాళ్ళు, సత్యమును,ధర్మమును నమ్మి ఆచరించే వాళ్ళు, ఆచారకాండ,జ్ఞానకాండ యందు నమ్మకము, భక్తీ, ఆసక్తి వున్న వాళ్ళు, వాళ్ళు ఎవరైనా ఏ వర్ణము వారు అయినా ఈ సత్సంగమునకు ఆహ్వానితులే. వారు నిర్బయముగా సభ్యులుగా ఈ blog లో చేర వచ్చును.
హైందవ సంస్కృతికి, సనాతన ధర్మమునకు, అద్దం పట్టే విషయములు, దైవిక సంబంధమైన, పూజ, అనుష్టానము, ఆచార వ్యవహారములు, కర్మకాండ, మంత్రానుష్టానములు, తపస్సు, యజ్ఞము, యోగము, ధ్యానము,సమాధి, ... గృహస్థాశ్రమ ధర్మములు, వైవాహిక ధర్మములు,మొదలగు విషయములను గురించి చర్చిస్తూ, ఒకరికి తెలిసిన విషయములను మరొకరికి తెలుపు కొంటూ, ఆ పరమాత్మను, పరదేవతను చేరుకోవడమే ఈ బ్లాగ్ యొక్క ముఖ్య ఉద్ధేశ్యము.
మీ
శ్రీ భాస్కరానంద నాథ

Monday 17 September 2012

మను ధర్మ శాస్త్రము



మను ధర్మ శాస్త్రము లోని కొన్ని ముఖ్య విషయములు.
ఇంద్రియాలు బలం గలవి కాబట్టి వివేకం గలవారినైనా చెడుదారి కీడువి. కాబట్టి తల్లితోగాని, సోదరితోగాని, కూతరురహ్మచారి బోడిగుండుతోగాని, జలతోగాని ఉండాలి. సూర్యుడస్తమించక ముందు, సూర్యుడు ఉదయించిన తరువాత బ్రహ్మచారి నిద్రింపకూడదు. అలా పొరపాటున నిద్రిస్తే మరునాడు పగలంతా గాయత్రీ జపం చేస్తూ, ఉపవాసం వుండి రాత్రి భోజనం చేయవచ్చు. ఇలా ప్రాయశ్చిత్తము చేసుకోని వాడిని మహాపాపం చుట్టుకుంటుంది.
ధర్మార్థాలు కామ హేతువులవడంవల్ల శ్రేష్ఠమైనవని కొందరు అంటారు. అర్థ కామములు సుఖాన్ని కలిగిస్తాయి. కాబట్టి అవి శ్రేష్ఠమయినవని కొందరు అంటారు. ధర్మం, అర్థకామాలకు కారణం కాబట్టి ధర్మం శ్రేష్టమని కొందరు అంటారు. అర్థమే ధర్మకామాలకు హేతువు కాబట్టి అర్థమే శ్రేష్టమని కొందరు చెబుతారు. కాని ధర్మార్థ కామములు మూడూ పురుషార్థములు కాబట్టి అవి శ్రేష్టములని మనువు అభిప్రాయం.
గురువు సన్నిధానంలో గురువు కంటే మంచి ఆహారం తినకూడదు. గురువు కంటే మంచి బట్టలు కట్టకూడదు. గురువు పడుకోన్నాక పడుకోవాలి. గురువు నిద్ర లేవకముందే నిద్రలేవాలి. గురువును పేరుపెట్టి మాట్లాడకూడదు. గురువులా మాట్లాడి, నడిచి, నటించి అతన్ని వెక్కిరించకూడదు. గురువులను దూషిస్తే తన విద్య యంతయూ నశించును. గురువును ఎవరైనా నిందిస్తుంటే చెవులు మూసుకోవాలి. లేదా వేరొక చోటికి పోవాలి.
శిష్యుడు గురువుపై అపవాదు మోపితే గాడిదగా, నిందిస్తే కుక్కగా, గురువు సంపదను అనుభవిస్తే పురుగుగా, గురువును ద్వేషిస్తే కీటకంగా జన్మిస్తారు. గురువునకు గురువు వచ్చినప్పుడు, గురువునకు నమస్కరించినట్లే ఆయనకూ నమస్కరించాలి. గురువు ఇంట్లో ఉండేటప్పుడు తల్లిదండ్రులు వచ్చినా గురువు ఆనతి లేకుండా వారికి నమస్కారం చేయకూడదు.
సజాతీయులైన గురుపత్నులు గురువువలె పూజింపదగినవారు. గురుపత్ని జవరాలై తే యవ్వనంలో వున్న శిష్యుడు ఆమెకు పాదాభివందనం చేయకూడదు. పురుషులను మొహానికి లోనుచేసి వాళ్ళను పతనం చేయడం స్త్రీల స్వభావం కాబట్టి, విద్వాంసులు స్త్రీల విషయంలో ఏమరపాటుగా వుండకూడదు.
పురుషుడు విద్వాంసుడైనా, అవిద్వాంసుడైనా స్త్రీల వలలో పడటం సహజం. స్త్రీలు కామక్రోధ వశుడైన విద్వాంసుడినైనా, మూఢుడినైనా లొంగదీసి చెడు దారికి ఈడ్వ గలిగినవారు.

ఆచార్యుడు పరమాత్మ స్వరూపుడు తండ్రి హిరణ్యగర్భ స్వరూపుడు. తల్లి భూదేవి స్వరుపురాలు. అన్న ఆత్మ స్వరూపుడు. వీరు దేవతా స్వరుపూలు కాబట్టి వీళ్ళను తిరస్కరించకూడదు.
బ్రాహ్మణునికి జ్ఞానముచేత, క్షత్రియునికి వీరత్వము చేత, వైశ్యునకు ధనధాన్యముల వల్ల, శూద్రునకు వయసుచేత గొప్పతనం లభిస్తుంది. బ్రాహ్మణుడెప్పుడూ వేదాలను, ఉపనిషత్తులను అధ్యయనం చేయాలి. ఎవడు వేదాధ్యయనం చేయక యితర శాస్త్రాలను అభ్యసించునో అతడు అతని వంశస్తులు శూద్రత్వం పొందుతారు.
బ్రాహ్మణునకు తల్లి గర్భామునుంచి మొదటి జన్మము, ఉపనయనం రెండవ జన్మము, యజ్ఞము తృతీయ జన్మము. ఉపనయన మయ్యేదాకా శ్రాద్ధకాలమున చెప్పవలసిన మంత్రాలు తప్ప మరే ఇతర వేదమంత్రాలు చెప్పకూడదు. వేదం వలన మరోజన్మ కలిగేవరకూ (ఉపనయనం అయ్యేవరకు) బ్రాహ్మనుడూ, శూద్రునితో సమానుడే.
బ్రహ్మచారి తేనెను, మాంసమును తినరాదు. కర్పూర చందన కస్తూరాది సువాసన ద్రవ్యాలను వాడరాదు. వీటిని  కలిపినా పదార్థాలను తినకూడదు. పువ్వులు ధరించరాదు. స్త్రీలతో సంభోగించరాదు. ప్రాణి హింస చేయకూడదు. పాదరక్షలు ధరించకూడదు. క్రోధాన్ని, లాభాన్ని విడిచిపెట్టాలి. పాటలు పాడకూడదు. నాట్యం చేయకూడదు. సంగీత వాయిద్యాలు వాయించరాదు. జూదం ఆడకూడదు. ఇతరులతో వృధాగా తగాదా పడకూడదు. ఇతరులను నిందించక కూడదు. అబద్ధాలు చెప్పకూడదు స్త్రీలవైపు కోర్కెతో చూడకూడదు.
గురువు, తల్లిదండ్రులు, అన్న వీరివల్ల బాధపడ్డా వారిని తిరస్కారింపకూడదు. ముఖ్యంగా బ్రాహ్మణులు ఈ విషయాన్ని తప్పక పాటించాలి. వీరు ముగ్గురికీ శుశ్రూష చేయడమే ఉత్తమ తపస్సు. వాళ్ళ అనుమతి లేకుండా మరియే ఇతర పుణ్యకార్యం చేయకూడదు. వారే ముజ్జగములు. వారే వేదములు. వారే యజ్ఞాదిఫల దాతలు కనుక త్రేతాగ్నులు. ఎవడు తల్లిదండ్రులను, గురువులను ఆదరించునో వాడు అందరిని ఆదరించువాడు. ఎవడీ ముగ్గురినీ తిరస్కరించునో అతని అన్ని క్రియలు నిష్పలము.
శ్రద్ధగలవాడు తనకన్నా తక్కువవాని నుంచైనా విద్యను గ్రహించాలి. తక్కువ కులం వారినుంచైనా స్త్రీని గ్రహించాలి.
స్త్రీలు, రత్నాలు, విద్య, ధర్మము, ఆమోదము, సుభాషితము, నానా విధవృత్తులు శిల్పాలను ఎక్కడనుంచి అయినా గ్రహించవచ్చు.
మోక్షాన్ని పొందగోరు బ్రహ్మచారి శిష్యుడు బ్రాహ్మణేతరుడయిన గురువుకు, వేదాధ్యయనం చేయని బ్రాహ్మణుడికి యావజ్జేవం శుశ్రూష చేయకూడదు. శరీరం నశించేదాకా ఎవడు గురు శుశ్రూష చేయునో అతడు తప్పక శాశ్వత బ్రహ్మలోకమును పొందుచున్నాడు.
వేదాధ్యయనం చేయడానికి ముందు శిష్యుడు గురువుకు ఏ విధమైన దక్షిణ ఇవ్వకూడదు. వేదాధ్యయనం ముగిసిన పిదప, వివాహం చేసుకోడానికి గురువు అనుమతి పొంది ఆ తరువాత గురువు కోరిన దానిని దక్షిణగా సమర్పించాలి.
ఇంద్రియాలు బలం గలవి కాబట్టి వివేకం గలవారినైనా చెడుదారి కీడువి. కాబట్టి తల్లితోగాని, సోదరితోగాని, కూతరుతోనయినా ఒంటరిగా కూర్చోకూడదు.
భూమి, బంగారము, ఆవులు, గుర్రాలు, గొడుగు, పాదరక్షలు, ఆసనము, ధాన్యము, కూరగాయలు, బట్టలు వీటిని దక్షిణగా ఇస్తే గురువుకు సంతోషం కలుగుతుంది.
రాహ్మణుడు శూద్రస్త్రీని వివాహం చేసుకుంటే భ్రష్టుడవుతాడని అత్రి మహర్షి, గౌతమ మహర్షి చెప్పారు. బ్రాహ్మణుడు శూద్రస్త్రీతో పుత్రుణ్ణి కంటే ఆ పిల్లవాడి తండ్రి పతితుడవుతాడని శౌనక మహాముని చెప్పాడు. బ్రాహ్మణునికి శూద్రకన్యకు పుట్టినవాడు పతితుడవుతాడని భృగుమహర్షి చెప్పారు. శూద్ర స్త్రీని శయ్యపైకి ఎక్కించుకున్న బ్రాహ్మణుడు అధోగతి పొందుతాడు. ఆ శూద్రస్త్రీతో పిల్లల్ని కంటే బ్రాహ్మణత్వాన్నే కోల్పోతాడు.
ఏ బ్రాహ్మణుడు తన భార్య అయిన శూద్ర స్త్రీతో హోమములు, శ్రాద్ధ కర్మలు, అతిథి పూజలు జరిపిస్తాడో వాటిని దేవతలు, పితృదేవతలు గైకొనరు. అట్టి బ్రాహ్మణునికి స్వర్గలోక ప్రాప్తి లేదు.
వివాహం ఎనిమిది రకాలు: అవి-బ్రాహ్మము, దైవము, అర్షము, ప్రాజాపత్యము, అసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచము. ఈ ఎనిమిదింటిలో పైశాచం అధమము, బ్రాహ్మ, దైవ, ఆర్ష, ప్రాజాపత్యములు. ఈ నాలుగు వివాహాలు బ్రాహ్మణునికి మేలయినవి. అసుర, పైశాచ వివాహములు తప్ప మిగిలినవి క్షత్రియులకు సమ్మతములు. రాక్షసము తప్ప మిగిలిన వివాహాలు వైశ్య, శూద్రులకు ధర్మ శాస్త్ర విహితమే అని తెలుసుకోవాలి.
వేదాధ్యయనం చేసి, సదాచార వంతుడయిన ఒక బ్రహ్మచారిని తానుగా రప్పించి, మర్యాదలు చేసి, అలంకరించిన కన్యను అతనికి ఒసగడాన్ని బ్రాహ్మణ వివాహం అంటారు.
జ్యోతిష్టోమము మొదలయిన యజ్ఞాలలో ఆధ్వర్యం చేసే ఋత్విజునికి కన్యను ఇవ్వడం                      దైవ వివాహమంటారు.
యాగాది సిద్ధికోసంగాని, కన్యకు ఇవ్వడానికిగాని రెండు ఆవులనో, రెండు ఎద్దులనో వరుని నుంచి తీసుకుని శాస్త్ర ప్రకారం వరునికి కన్యను ఇవ్వడం ఆర్ష వివాహం అంటారు.
మీ ఇద్దరూ కలసి ధర్మమాచరించండని చెప్పి కన్య తల్లిదండ్రులు వరుని పూజించి పిల్లనివ్వడం ప్రాజాపత్య వివాహం  అంటారు.
జ్ఞాతులకు, పిల్లకు కావలిసిన ధనం ఇచ్చి తమ ఇష్టంతో పెళ్లిచేసుకోవడాన్ని అసుర వివాహమంటారు. స్త్రీ పురుషు లొకరికొకరు ఇష్టంతో అంగీకరించి కలవడాన్ని గాంధర్వమంటారు. ఈ వివాహం కామసంబంధమైనది. మైధున కర్మ కోసం ఏర్పడింది.
కన్యక బంధువులు సమ్మతింపనప్పుడు వారిని చంపిగాని లేదా నాశనం చేసి వాళ్ళకోసం విలపిస్తున్న కన్యను బలవంతంగా తెచ్చుకోవడం రాక్షస వివాహం అంటారు.
నిద్రించే ఆమెనుగాని, మత్తులోవున్న ఆమెనుగాని, ఏమరుపాటుతోనున్న ఆమెనుగాని బలాత్కారముగా, ఏకాంతముగా క్రీడించడాన్ని పైశాచికం అంటారు. ఈ వివాహం మిక్కిలి నీచమైనది.
జలధారాపూర్వకంగా కన్యాదానం చేయడం బ్రాహ్మణులకు ఉత్తమం. ఉదకథారా పూర్వకంగా కన్యాదానం చేయాలన్న నియమం క్షత్రియాది తక్కిన వర్ణాల వారికి లేదు. తల్లి దండ్రులు మాట ఇవ్వడం, వధూవరులకు ఇష్టం వుంటే చాలు.
బ్రాహ్మణ వివాహముచే పుట్టిన కుమారుడు పుణ్యం చేసినవాడు. అతడు తన ముందటి పది తరాల వారిని, తన తరువాత పది తరాల వారిని పాపాల నుంచి విముక్తం చేస్తాడు.
దైవ వివాహం చేసుకున్న దంపతులకు పుట్టినవాడు ముందు ఏడు తరాల వారిని,   తరువాత ఏడు తరలవారిని పాపవిముక్తులను చేస్తాడు. ఆర్ష వివాహజాతుడు ముందు వెనుకల మూడు తరాల వారిని, ప్రాజాపత్య వివాహజాతుడు ముందు వెనుకల ఆరు తరాల వారిని ఋణ విముక్తుడిని చేస్తాడు.
బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రాజాపత్యము మొదలైన నాలుగు వివాహాల్లో జన్మించిన పుత్రులు వేదాధ్యయన సంపత్తి వలన వచ్చిన తేజస్సు కలిగినవారై, పెద్దలకు ఇష్టమైన వారుగా జన్మిస్తారు. వీరు మంచి రూపము, గుణము, బలము గలవారై, ధనవంతులై కీర్తి ప్రతిష్టలు పొందుతారు. నూరేళ్ళు జీవిస్తారు.
రాక్షస వివాహం వలన జన్మించిన పుత్రులు క్రూరులు, అసత్యవాదులు, వేదవిరోధులు, యాగాదికర్మ ద్వేషులై వుంటారు.

Friday 29 June 2012

శ్రీదేవీ - మహాత్త్వము


చండీ తత్వము
ఆది తత్త్వమును స్త్రీ మూర్తిగా భావించి చేయు ఉపాసన శ్రీవిద్యోపాసన అని అందురు  . ఇది లలితా పర్యాయము, చండీ పర్యాయము అని రెండు విధములు.
రెండింటికీ శబ్దతః భేదమే కానీ వస్తుతః భేదము లేదు. మొదటిది పంచదశాక్షర మూల మంత్రము తో కూడినది   . రెండవది నవాక్ష ర మంత్రముతో కూడినది.  ఆ పరమాత్మ స్వరూపాన్ని స్త్రీ మూర్తిగా పూజించుటలో ఒక విశేష సౌలభ్యము కలదు. లోకములో తండ్రి దగ్గర కంటే తల్లి దగ్గర పిల్లలకు చనువు ఎక్కువ. తల్లి పిల్లల తప్పులు ఎంచక వాళ్ళను కడుపులో పెట్టుకొని లాలిస్తుంది. అన్ని విధముల వాళ్ళను బుజ్జగించుచూ మంచి అభివృద్దిలోకి తెస్తుంది. తండ్రి కోపపడినా తల్లి అంత తొందరగా కోపపడదు. ఎంతో ప్రేమానురాగాలతో బిడ్డను దగ్గరకు తీసుకొని పాలిస్తుంది. బిడ్డ యొక్క మంచి చెడులను తండ్రి కన్నా తల్లికే ఎక్కువగా తెలియును. అందువలనే వేదము కూడా “మాతృ దేవోభవ” అనుచూ తల్లిని పూజించమని తండ్రి కంటే తల్లికే అగ్ర పీట వేసినది. తల్లి యందలి ఈ నిర్వ్యాజ ప్రేమానురాగాల వలన పూజలలో గూడా భగవంతుడిని అమ్మ వారుగా పూజించుటలోని విశేషము.
కాళిదాసు తన రఘువంశము లో “వాగార్దా వివ” అని స్మరించినాడు. ఆది శంకరులు “మాతా చ పార్వతీ” అని స్తుతించినారు. వశిన్యాది వాగ్దేవతలు “ శ్రీ మాతా” అని అమ్మను పిలిచినారు.

“దుర్మార్గుడైన బిడ్డ వుంటాడు గాని, దుర్మార్గురాలైన తల్లి వుండదు”... అని ఆది శంకరుల వారు అన్నారు.
జగన్మాత పూజ ఇతర దేవతల కంటే త్వరితముగా ఫలితము నిచ్చి, బిడ్డను రక్షించును. జగన్మాత ఉపాసనము మాతృ సేవ వంటిది. తల్లి బిడ్డలను పెంచి పోషించినట్లు, ఆ జగన్మాత తన్ను ఉపాసించు భక్తులను తన బిడ్డలుగా ప్రేమించి భుక్తి ముక్తులను తప్పక ఇవ్వగలదు.  ఆమెను సేవించడము అత్యంత సులభము. తప్పులున్ననూ తల్లి సవరించును.
శ్రీ చక్ర సంచారిణి యైన జగన్మాత జగత్తునంతయు పోషించుచూ చరాచర సృష్టికి మూల కారణమై అంతటా వ్యాపించి సర్వ ప్రాణులలో శక్తి స్వరూపం లో చిచ్ఛక్తి అయి, చైతన్యమై, పర బ్రహ్మ స్వరూపమై ప్రకాశిస్తూ వున్నది.
సకల ప్రాణులకూ ఆమె తల్లి అయి “శ్రీమాత” గా పిలువబడు చున్నది.  అందుకే ఆమెను “ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ” అని పోతనామాత్యుడు అన్నారు.
వేదములు “విద్య” అని ఏ దేవిని చెప్పుతూ వుంటాయో, ఆ దేవిని ఆశ్రయించిన వారి ఆర్తిని పోగొట్టే దయామయి ఆ దేవి. తన్ను నమ్మిన వారిని ఆదుకునే అమ్మ. మునులు ఆ తల్లి పాదములను ధ్యానించి జ్ఞానులవుతారు.
పరమేశ్వరుని యందే అంతర్లీనమై, రక్త వర్ణ ప్రభలచే వెలుగొందుచూ, జీవన్ముక్తికి, ఐహిక ఫల సాధనకు ప్రత్యక్ష సాక్షియై, శ్రీచక్రము నందలి బిందు స్థానమై నెల కొని యున్న ఆ తల్లి శ్రీ లలిత యై, మహా త్రిపుర సుందరిగా, పిలువబడుచున్నది.
౧. జప చండీ  ౨. హోమ చండీ  ౩. తర్పణ చండీ అని త్రి విధములుగా చండీ ఉపాసన కలదు.
గుణ త్రయములకు ప్రతీక అయిన మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతీ రూప కలయక  చండీ.
జగన్మాత సాత్విక రూపం లలిత అయితే, తామస రూపం చండీ.
 
చండీ పరాభట్టారికా అంటే మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతీ స్వరూపిని, చండీహోమము అనగా దుర్గా సప్తశతి అనే 700 శ్లోకమలచే హోమము చేయడము. ఇందు 700 శ్లోకమలు 3 చరిత్రలుగా విభజించి ఉన్నాయి.
. ప్రధమ చరిత్ర మహాకాళీస్వరూపముగా, మధ్యమ చరిత్ర మహాలక్ష్మీ స్వరూపముగా,  ఉత్తమ చరిత్ర మహా సరస్వతీ స్వరూపముగా చెప్పబడి ఉన్నది.
చండీసమదైవం నాస్తి అన్ని పురాణాలు చెపుతున్నాయి. కలియుగములో సమస్త బాధలు, అతివృష్టి. అనావృష్టి, శత్రునివారణ చేయటానికి కుటుంబమును సర్వసౌభాగ్యములతో వృధి చేయడానికి మహాకాళి. మహాలక్ష్మీ, మహాసరస్వతి అయిన చండీపరాదేవత అనుగ్రహము చాలా అవసరము. అమ్మవారి ప్రీతిపాత్రమైన పౌర్ణమి తిధియందు త్రిదేవిసహీత, త్రిశక్తి అయిన చండిపరాదేవతను ఆరాధించి చండిహోమము ఎవరైతే జరిపించుకుంటారో ఆ కుటుంబమంతా పుత్ర పౌత్రాదులతో సుఖముగా జీవిస్తారని శ్రీ డేవి భాగవతమందు చెప్పబడినది.

 సృష్టి స్థితి లయములు గావించున్న ఆ మహా మాయను ఎవరు ఉపాసించు చున్నారో, వారు జనన మరణ రూపమగు సంసారము నుండి తరించు చున్నారని, మోక్షమును బొందుచున్నారని నృసింహతాపిన్యుపనిషత్తు
తెలియ జెప్పుచున్నది. ఆ శక్తిని భజించినవాడు మృత్యువును జయించి మోక్షమును బొందును.
త్వం వైష్ణవీ  శక్తి రనంత వీర్యా విశ్వస్య బీజం పరమాzపి మాయా సమ్మోహితం దేవి సమస్త మే తత్...
ఈ లోక మంతయూ మాయా శక్తి చే సమ్మోహిత మగుచున్నది.
ఒకప్పుడు దేవిని దేవత లెల్లరు “అమ్మా నీ వెవరు? అని అడుగగా
“నేను బ్రహ్మ స్వరూపిణిని, నా వల్లనే ప్రకృతి పురుషులు పుట్టుచున్నారు, జగమును జనించు చున్నది” ... అని చెప్పినది.
 సర్వే వై దేవా దేవీ ముపతస్థుః కాసిత్వం దేవీ సా zబ్రవీ దహం  బ్రహ్మ రూపిణీ మత్తః ప్రకృతి పురుషాత్మకం జగత్.
అట్లే మాయ, బ్రహ్మ రూపిణి, విశ్వ మోహిని, ఆత్మ స్వరూపిణి అని భువనేశ్వరి ఉపనిషత్తు చెప్పుచున్నది.
  “ స్వాత్మ్యైవ  లలితా .... అని భావనోపనిషత్తు చెప్పు చున్నది
హ్రీం బీజము పర బ్రహ్మ స్వరూపమని, మోక్షప్రదమని దేవీ భాగవతము చెప్పు చున్నది.
చితి స్తత్పదలక్ష్యార్దా చిదేకరస రూపిణి ... అని బ్రహ్మాండ పురాణము అమ్మను కొని యాడినది.
ఇట్లు అష్టాదశ పురాణములు, ఉప పురాణములు,  స్మృతులు దేవిని పర బ్రహ్మమని ప్రతి పాదించినవి.

శక్త్యక్ష రాణి  శేషాణి హ్రీం కార ఉభాయాత్మకః .. అని 
ఇతర బీజాక్షరములు కేవలము  శక్తికి సంబంధించినవి వనియు, మాయా బీజమైన హ్రీం కారము మాత్రము ఉభాయాత్మక మైన శివ శక్త్యాత్మక బీజమని బ్రహ్మాండ పురాణము చెప్పు చున్నది.
హ్రీం హ్రీమితి ప్రతి దినం జపతాం జనానాం,
కిం నామ దుర్లభమిహ త్రిపురాధివాసే.
త్రిపురముల యందు వసించు ఓ .. అమ్మా హ్రీం హ్రీం అని నీ బీజ మంత్రమును జపించు వారికీలోకమున దుర్లభమైన దేమియునూ లేదు. సకల కల్యాణ భాజనమైనదీ హ్రీంకారము. శ్రీదేవీ ప్రణవము  హ్రీంకారము.
(సూచన:- ఉపదేశము లేనిదే మంత్రములను ఉపాసన చేయకూడదు.)
ఓం శ్రీ గురుః  పరమ కారణ భూతాశక్తిః  ... అని భావనోపనిషత్తు చెప్పు చున్నది.
శ్రీవిద్యా పూర్ణ దీక్ష నొసగిన శ్రీ గురువులు  శ్రీ పరాదేవి స్వరూపులే. శ్రీ గురుదేవుల అనుగ్రహము చేత మహా వాక్య ప్రాప్తి, ( శ్రీవిద్యా పూర్ణ దీక్ష యందు మహా వాక్యములతో గూడిన మహా పాదుకలను ఇచ్చెదరు.) 
దాని వలన బ్రహ్మాత్మైక్య సిద్ది లభించు చున్నందున శ్రీ గురువులే పరమ కారణమైన పరా శక్తి స్వరూపులని,       శ్రీ గురువులకు శ్రీ మాతకు అభేదము అని చెప్పు చున్నది. అట్టి శ్రీ గురుదేవులకు నమస్కరిస్తూ

మీ
భాస్కరానందనాధ (దీక్షా నామము)
కామరాజుగడ్డ రామచంద్రరావు