Sunday 30 December 2012

ఆహ్వానము

ఆహ్వానము
సనాతన ధర్మమును నమ్మి,విశ్వసించి, ఆచరించే వాళ్ళు, పునర్జన్మ సిద్ధాంతమును నమ్మేవాళ్ళు, దేవుడు వున్నాడు అని నమ్మే వాళ్ళు, బొట్టు పెట్టుకొనే వాళ్ళు, వేదమును మన పురాణములను గాఢంగా నమ్మేవాళ్ళు, ఆది శంకరులు శ్రీ శంకర భగవత్పాదుల సిద్దాంతమును నమ్మేవారు, అద్వైత సిద్దాంతమును నమ్మి ఆచరించే వారు, పెద్దలను, గురువులను గౌరవించే వారు, మన హైందవ సంస్కృతికి గౌరవము ఇచ్చి, ఆచరించే వాళ్ళు, మన మాతృ భాష తెలుగును గౌరవించే వాళ్ళు, శంకర భగవత్పాదులు స్థాపించిన షణ్మతాచారము మీద నమ్మకము వుంచి, పంచాయతనమును నమ్మి కొలిచే వాళ్ళు, దేవుడి మీద నమ్మకము వున్న వాళ్ళు, మంత్ర, తంత్ర, యంత్ర శాస్త్రముల మీద నమ్మకము వున్న వాళ్ళు, వేద, శ్రుతి, పురాణ వాంగ్మయమును భక్తితో నమ్మి కొలిచే వాళ్ళు, ధర్మాచరణ కలిగిన వాళ్ళు, హైందవ సంస్కృతికి అద్దం పట్టే వాళ్ళు, ఆది దంపతులను, శ్రీ సీతారాములను, శ్రీలక్ష్మీ నారాయణులను, శ్రీ వేంకటేశ్వరులను, ఇలవేల్పులుగా, ఇష్ట దైవముగా కొలిచే వాళ్ళు, సత్యమును,ధర్మమును నమ్మి ఆచరించే వాళ్ళు, ఆచారకాండ,జ్ఞానకాండ యందు నమ్మకము, భక్తీ, ఆసక్తి వున్న వాళ్ళు, వాళ్ళు ఎవరైనా ఏ వర్ణము వారు అయినా ఈ సత్సంగమునకు ఆహ్వానితులే. వారు నిర్బయముగా సభ్యులుగా ఈ blog లో చేర వచ్చును.
హైందవ సంస్కృతికి, సనాతన ధర్మమునకు, అద్దం పట్టే విషయములు, దైవిక సంబంధమైన, పూజ, అనుష్టానము, ఆచార వ్యవహారములు, కర్మకాండ, మంత్రానుష్టానములు, తపస్సు, యజ్ఞము, యోగము, ధ్యానము,సమాధి, ... గృహస్థాశ్రమ ధర్మములు, వైవాహిక ధర్మములు,మొదలగు విషయములను గురించి చర్చిస్తూ, ఒకరికి తెలిసిన విషయములను మరొకరికి తెలుపు కొంటూ, ఆ పరమాత్మను, పరదేవతను చేరుకోవడమే ఈ బ్లాగ్ యొక్క ముఖ్య ఉద్ధేశ్యము.
మీ
శ్రీ భాస్కరానంద నాథ